మంచి రోజులు మనకూ వస్తాయి.

డిసెంబర్ 14, 2009

ఈ పాటలు బాగున్నాయి, నాకు నచ్చాయి.

  జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం
  ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం
  తరతరాల చరిత గల తల్లీ నీరాజనం
  పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం
  జై తెలంగాణ జై జై తెలంగాణ
  జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥

  ‘పంపన’కు జన్మనిచ్చి ‘బద్దెన’కు పద్యమిచ్చి
  భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి
  ‘హాలుని’ గాథాసప్తశతికి ఆయువులూదిన నేల
  బృహత్కథల తెలంగాణ కోటిలింగాల కోన
  జై తెలంగాణ జై జై తెలంగాణ
  జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥

  ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన
  తెలుగులో తొలి ప్రజాకవి ‘పాలకుర్కి సోమన్న’
  రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని కట్టి
  కవిరాజై వెలిగె దిశల ‘కంచర్ల గోపన్న’
  జై తెలంగాణ జై జై తెలంగాణ
  జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥

  కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి
  ‘మల్లినాథసూరి’ మా మెతుకు సీమ కన్నబిడ్డ
  ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధు వతడు
  ‘దిగ్నాగుని’ కన్న నేల ధిక్కారమే జన్మహక్కు
  జై తెలంగాణ జై జై తెలంగాణ
  జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥

  ‘పోతన’దీ పురిటిగడ్డ ‘రుద్రమ’దీ వీరగడ్డ
  గండరగండడు ‘కొమరం భీముడే’ నీ బిడ్డ
  కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప
  గోలుకొండ నవాబుల గొప్ప వెలిగే చార్మీనార్‌
  జై తెలంగాణ జై జై తెలంగాణఠి
  జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥

  రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచెర్ల
  ‘సర్వజ్ఞ సింగభూపాలుని’ బంగరు భూమి
  వాణీ నా రాణీ అంటు నినదించిన కవికుల రవి
  ‘పిలలమఱ్ఱి పినవీరభద్రుడు’ మాలో రుద్రుడు
  జై తెలంగాణ జై జై తెలంగాణ
  జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥

  సమ్మక్క’లు ‘సారక్క’లు ‘సర్వాయిపాపన్న’లు
  సబ్బండావర్ణాల సాహసాలు కొనియాడుతు
  ఊరూర పాటలైన ‘మీరసాబు’ వీరగాథ
  దండునడిపే పాలమూరు ‘పండుగోల్ల సాయన్న’
  జై తెలంగాణ జై జై తెలంగాణ
  జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥

  కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు
  డప్పు డమరుకము డక్కి శారదస్వరనాదాలు
  పల్లవుల చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగా
  అనునిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం
  జై తెలంగాణ జై జై తెలంగాణ
  జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥

  జానపద జనజీవన జావళీలు జాలువార
  జాతిని జాగృతపరిచే గీతాల జనజాతర
  వేలకొలదిగా వీరులు నేలకొరిగిపోతెనేమి
  తరుగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం
  జై తెలంగాణ జై జై తెలంగాణ
  జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥

  బడులగుడులతో పల్లెల ఒడలు పులకరించాలి
  విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి
  తడబడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక
  ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మా వెలగాలి
  జై తెలంగాణ జై జై తెలంగాణ
  జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥

  గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ
  పచ్చని మా నేలల్లో పసిడి సిరులు కురవంగ
  సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
  ప్రత్యేక రాష్ట్రాన ప్రజల కలలు పండాలి
  జై తెలంగాణ జై జై తెలంగాణ
  జై తెలంగాణ జై జై తెలంగాణ ॥జయ జయహే॥

కవి అందెశ్రీ

FOR THIS POET’S BIOGRAPHY PLEASE VISIT
http://www.koumudi.net/General/andesri.html

http://andesri.wordpress.com/

జాతీయ గీతాలపై జరుగుతున్న చర్చలో తరచు ‘జయజయహే తెలంగాణ’ గీత ప్రస్తావన వస్తున్నది. చాలాకాలంగా ప్రజల నాలుకలపై నర్తిస్తున్నప్పటికీ ఈ గీతం ఇప్పటి వరకు ఎక్కడా ప్రచురితం కాలేదు. అందెశ్రీ రాసిన ఈ గీతాన్ని తాజా చరణాలతో సహా పాఠకుల కోరిక మేరకు ప్రచురిస్తున్నాం. – ఆంధ్రజ్యోతి ఎడిటర్‌

06 డిసెంబర్ 2009, ఆంధ్రజ్యోతి సౌజన్యంతోటి

COPY PASTE FROM- http://discover-telangana.org/wp/2009/12/07/jayahe_telangana/#comment-4314

బండెనుక బండి కట్టి…

బండెనుక బండి కట్టి
పదహారు బండ్లు కట్టి
ఏ బండ్లె వస్తవ్ కొడుకో
నైజాము సర్కరోడా
నాజీల మించినవ్ రో
నైజాము సర్కరోడా

పోలీసు మిలిట్రి రెండు
బలవంతులనుకోని
నువ్వు పల్లెలు దోస్తివి కొడుకో
మా పల్లెలు దోస్తివి కొడుకో
నైజాము సర్కరోడా

స్త్రీ పురుషులంత గలిసి
ఇల్లాలమంత గలిసి
వడిసేల రాళ్లు గట్టి
వడివడిగ గొట్టితేను
కారాపు నీళ్లు దెచ్చి
కండ్లళ్ల జల్లితేను
నీ మిలిట్రి బారిపొయెరో
నీ మిలిట్రి బారిపొయెరో…
నైజాము సర్కరోడా

సుట్టుముట్టూ సూర్యపేట,
నట్టనడుమ నల్లగొండ
నువ్వుండేది హైద్రబాదు
దాని పక్క గోలుకొండ
గోలుకొండా ఖిలా కిందా
గోలుకొండా ఖిలా కిందా
నీ గోరి కడుతం కొడుకో
నైజాము సర్కరోడా

బండి యాదగిరి

COPY PASTE FROM http://hridayam.wordpress.com/2009/12/09/brute-force-on-telangana/

ప్రకటనలు

1 వ్యాఖ్య »

 1. chala bagundi

  వ్యాఖ్య ద్వారా chandu — జనవరి 11, 2010 @ 3:46 సా. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: