మంచి రోజులు మనకూ వస్తాయి.

డిసెంబర్ 22, 2009

ఆంధ్రము ఇంకా తెలంగాణము లకు అర్థం చెప్పండి చాలు

ఆంధ్రము ఇంకా తెలంగాణము లకు అర్థం చెప్పండి చాలు

support your answers please…….

ప్రకటనలు

4 వ్యాఖ్యలు »

 1. అయ్యా! ఏక వాక్యం ప్రశ్నతో …మీరు..!!!
  ఆంధ్రా అన్న పదానికి నేనర్ధం చెప్పలేను. ఎందుకంటే,ఆ పదానికి అర్ధం చెప్పబడి లేదు. ఆంధ్ర దేశం రామాయణ కాలం నాటికే ప్రాశస్త్యమున్న దేశం. తెలుగు మాగాణము నుంచి వచ్చిన పదమే తెలంగాణము.త్రిలింగ దేశంలో ఒక ప్రాంతం. తెలుగు మాగాణము కూడా రామాయణ కాలం నాటి త్రిలింగ దేశంగా పేరుగాంచిన ఆంధ్ర దేశం లో ఓక ప్రాంతమే.
  ఆంధ్ర ప్రాంతమని మనం ప్రస్తుతం భావిస్తున్న ప్రాంతం, ఆంధ్ర్రులని మనం భావిస్తున్న వారు ఒకప్పుడు ,తెలంగాణప్రాంతంలో రాజ్యాలు పాలించిన కమ్మ,రెడ్డి రాజుల వంశజులే. ప్రస్తుతం కమ్మ వారు అనబడే వారు తెలంగాణమును పాలించిన కాకతీయ వంశస్తులుగా చరిత్ర చెబుతోంది. అలాగే కమ్మ,రెడ్డి, వెలమ భ్రాహ్మణ కాపు,కులస్తులు, ఒకే తెగనుండి విడివడిన వర్గాలుగా, ద్రుష్టాంతరాలు వికిపేడియాలో దొరుకుతాయి.వీరంతాఆయా రాజ్యాధిపతుల వద్ద వున్నత పదవులు పోషించిన వారే. వారి వంశజులు యీ ప్రాంతం నుండే ప్రస్తుత ఆంధ్ర,కర్ణాటక,తమిళనాడు, ప్రాంతాలకు,తెలంగాణ ప్రాంతం నుండి వలస వెళ్ళిన వారే.
  ప్రస్తుత ఆంధ్రులపూర్వీకులు పాలించిన ప్రాంతమే ప్రస్తుతం మనముంటున్న తెలంగాణ. గొల్ల కొండను (ప్రస్తుతం గోల్కొండ) రాజధానిగా చేసుకొని పరిపాలించిన కాకతీయులు, (కమ్మ వారు) పాలించిన కాకతీయ సామ్రాజ్యం నుండి ఆంధ్ర ప్రాంతానికి వలస వెళ్ళిన కమ్మవారు. భ్రాహ్మణులు, వెలమలు, రెడ్లు యితర తెగలు ,ఆర్ధిక స్తితి గతులపై,వ్రుత్తుల రీత్యా, యేర్పడిన సామాజిక తెగలు, కులాలు వేరైనా, తెలంగాణ మాగాణం నుండి క్రుష్ణా, గోదావరీ నదీ పరీవాహక ప్రాంతాలకు జలవనరులు వెతుక్కొంటూ వలసవెళ్ళిన వారే.కాకుంటే యిది వేలయేళ్ళకాల ప్రవాహంలోజరిగిన పరిణామక్రమం.
  మీకు బోరుకొట్టకుంటే మీరడిగిన దానికన్న మరి కొంత ఎక్కువ….
  మన పూర్వీకులు, మనం యే కులానికి చెందిన వారైనా, మహారాష్ట్ర, రాజస్తాన్ ప్రాంతాలనుండి కడుపు పట్టుకొని వచ్చినవారే.అంతెందుకు, ప్రస్తుతం భారతీయులం, హిందువులం అని చెప్పుకొనే వారు,..వారి తరతరాలను విశ్లేషిస్తే వారి పూర్వీకులు మధ్య ప్రాశ్చ్యదేశాలనుండి,యీ భారత గడ్డ పై కి వలస వచ్చిన ఆర్య సంతతివారే. హిందూ మతం ఆర్యుల మతం. వారినే మన దేవుళ్ళుగా కొలుస్తున్నాం.అసలైన స్థానిక భూమి పుత్రులైన ద్రవిడులు,హిందూ మహా సముద్రంలొని దీవుల కు తరిమి వేయబడ్డారు . యీ భూ ప్రపంచంలో మనిషిగా జీవి రూపాంతరం చెందినప్పటి నుండి కూడా, తదుపరి నిరంతరం, పయనిస్తూనే వున్నాడు. వలసలు నిత్యక్రుత్యంగా జరుగుతూనే వున్నాయి.భూప్రపంచంలో ప్రతి అంగుళమ్ భూమీవేలాది ప్రాణుల కళేబరాలు నిక్షిప్తమై వుంటాయి.అంతా మరుభూమియే.మరు భూముల్లో జీవించలేమని భావిస్తే యీ భూమి పైన జీవించడానికి తావే వుండదు.
  ప్రస్తుతం భారతీయ సంస్క్రుతి అని అనుకుంటున్నది వలసవచ్చిన ఆర్యుల సంస్క్రుతి, ప్రాతీయ ద్రవిడ సంస్క్రుతితో మిళితమై బలీయమై యిప్పటి భారతీయ సంస్క్రుతిగా కాలమాన స్తితిగతుల్లో స్థిరపడిందని నా అభిప్రాయం.( ఆధారాలు: ఆంధ్రుల చరిత్ర, కమ్మవారి చరిత్ర,,తదితరాలు.)యీ వ్యాసాన్ని తరువాత నా బ్లాగులో పోస్ట్ చేస్తానని తెలియ చేస్తున్నాను.
  రచన :నూతక్కి రాఘవేంద్ర రావు.తేదీ:24-12-2009.

  వ్యాఖ్య ద్వారా Nutakki Raghavendra Rao — డిసెంబర్ 24, 2009 @ 5:13 సా. | స్పందించండి

 2. meeku dhanyavaadamu

  manchi gaa thelipaaru

  nenu konni sangathulu kaluputhanu

  mee response ki chala santhoshisthunnanu

  ramakanth reddy

  వ్యాఖ్య ద్వారా kanred — డిసెంబర్ 24, 2009 @ 11:45 సా. | స్పందించండి

 3. ఆంధ్రము ఇంకా తెలంగాణము లకు అర్థం చెప్పండి చాలు
  మీఱు ప్రస్తావింఛినా టపాకి సరిఅయిన సమాదానం ఇక్కడ ఇవ్వబడిన లంకెలొ లభిస్తుంది, అయినా అడ్డ్దదిడ్డమయిన వ్యాఖ్యలు రాసెవారికి మన బ్లాగులొకంలొ కొదవలెదని గుర్తించాలని కొరుతున్నాను.
  http://www.tadepally.com/2009/12/blog-post_27.html#comments

  మీరిచ్చిన లంకెలోకెళ్ళి చూశాను. ఆ వ్యాఖ్యాతని కించిద్‌జ్ఞాని అనడం కంటే అజ్ఞాని అనడం సముచితం. అంతేకాక సదరు వ్యక్తికి కులగజ్జి కూడా ఉన్నట్లు కనిపిస్తున్నది. ఎందుకంటే అక్కడ అడిగినదొకటి. అతను చెప్పినదొకటి.

  అందఱం మహారాష్ట్ర నుంచి, రాజస్తాన్ నుంచి వచ్చామట. ఎవఱూ కనుగొనని, ఎక్కడా చెప్పబడని అపూర్వ విషయాలు వాక్రుచ్చుతున్నాడు. అందఱం ఉత్తరాది నుంచి వస్తే మఱి ఉత్తరాది భాషలతో సంబంధం లేని ఈ తెలుగుభాష ఎక్కణ్ణుంచి వచ్చింది ? ఈ ఉత్తరాది నుంచి వలసరావడం అనేది కొద్దో గొప్పో బ్రాహ్మణ, క్షత్త్రియ కులాలకేమో గానీ ఇతర కులాలకి వర్తించదు. తతిమ్మావాళ్ళంతా ఇక్కడివాళ్ళే.

  తెలంగాణకి అతనిచ్చిన వ్యుత్పత్తి (etymology) శుద్ధతప్పు. తెలంగాణలో మిట్టలే తప్ప మాగాణాలు చాలా తక్కువ. అసలు వ్యుత్పత్తి వేఱే ఉంది.

  అచ్చ/ ప్రాచీన తెలుగులో ఆణియము అంటే దేశం. ఆణిముత్యము అంటే దేశవాళీ/ స్థానిక ముత్యం. అలాగే తెలుంగాణియము అంటే తెలుగుదేశం అని అర్థం.

  తెలుంగు + ఆణియము = తెలుంగాణియము –> తెలంగాణ్యము

  దీన్నే ఉర్దూలో ఆ భాషావ్యాకరణ/ ఉచ్చారణసౌలభ్యం కోసం ముస్లిమ్ పాలకులు తేలికగా ’తేలింగానా’ అని రాసుకున్నారు. పాత ఇంగ్లీషు పుస్తకాల్లో కూడా Telingana అనే వర్ణక్రమం కనిపిస్తున్నది. తేలింగానా అంటే ఆ రోజుల్లో ఈ పది పశ్చిమాంధ్ర జిల్లాలు మాత్రమే కావు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మొత్తం 23 జిల్లాలూ ఆ రోజుల్లో తేలింగానాయే. ఎందుకంటే ఇవన్నీ ఒకే నవాబు (గోల్కొండ నవాబు) కింద ఉండేవి. ఆ వంశం అంతరించాక నిజాములు పరిపాలించడం మొదలుపెట్టారు. వారు ఒకసారి ఏ యుద్ధం గుఱించో ఇంగ్లీషువారికి ఋణపడి 1759 తరువాత ముందు కోస్తా జిల్లాలనీ, ఆ తరువాత రాయలసీమనీ బ్రిటీషువారికి ఋణం కింద ధారాదత్తం చేశారు. అలా పశ్చిమాంధ్ర జిల్లాలు నిజాముల కింద కిందా, తూర్పు, దక్షణాంధ్ర జిల్లాలు ఇంగ్లీషువారికిందా నలగడం మొదలుపెట్టాయి. నిజాముల రాజ్యంలో తెలుగుజిల్లాలే కాక కన్నడ, మరాఠీజిల్లాలు కూడా ఉండేవి. కనుక తెలుగుజిల్లాల గుఱించి తేలింగానా అని వ్యవహరించడం కొనసాగించారు. అంటే తెలుగువాళ్ళ భూమి అనే అర్థం తప్ప ఇప్పటి పశ్చిమాంధ్రులు భావిస్తున్నట్లు అదేదో మిగతా తెలుగునేల కంటే వేఱైనది అని కాదు.

  ఆంధ్ర అనేది తెలుగుభాషకి సంస్కృతనామం. మలయాళానికి కేరళ అన్నట్లు. తెలంగాణవాళ్ళు అనుకుంటున్నట్లు అది ఆ 13 పదమూడు జిల్లాలకే చెందినది కాదు. తెలంగాణ కూడా ఆంధ్రానే. ఆంధ్రా కూడా తెలంగాణానే. ఒకే జాతికి, ఒకే భూమికి ఉన్న రెండు పేర్లు ఇవి.

  ఎప్పుడు గ్రహిస్తారో ఈ చారిత్రిక సత్యాన్ని తెలుగుజనం, ముఖ్యంగా తెలంగాణ జనం !!

  -తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం

  ఇంతటి చక్కని వివరణ ఇచ్చిన శ్రీ తాడేపల్లి గారికి ఈ సందర్బంగా దన్యవాదలు తెలియచేసుకుంటున్నాను.

  ఒకటె వ్యాఖ్యా వున్న మీ టపా లక్ష్యం నెరవెరిందా అంటే మీకు సందేహ నివృత్తి అయిందా??? అయివుంటే ఈ విషయాన్ని సాధ్యమయినంత మందికి తెలియజెయటం మీ బాద్యతగా భావించాలని కొఱుతున్నాను.

  వ్యాఖ్య ద్వారా రేణూ కుమార్ — జనవరి 1, 2010 @ 10:10 ఉద. | స్పందించండి

 4. @తాడేపల్లి &
  రమాకాంత రెడ్డి గారూ!

  ప్రపంచంలో మనిషిగా పుట్టిన వాడు ఎంత విద్యావంతుడైనా పరిపూర్ణ విగ్నావంతుడు, సకల విద్యా పారంగతుడూ కాలేడు. ఎవరైనా తమకు తాము అలా భావిస్తే అంతకన్న మూర్ఖత్వం మరోటుండదు.
  నా విషయ పరిగ్నానాన్ని తూకమేయమని నేనెవ్వరినీ యాచించలేదు. మీరు పండితులే కావచ్చును.కాదనవలసిన అవసరం నాకులేదు..బహు భాషా కోవిదులూ కావచ్చును. నేనెందుకు కాదనాలి..మీరు చెప్పిన విషయాలు మీ సంకుచిత ధ్రుఃక్కోణంలోసమంజస మనిపించ వచ్చు, లేదా వాస్తవమూ కావచ్చు. కాదనను.
  దయచేసి వ్యక్తులను కించపరచ వద్దు. నిజంగా నా వుద్దేశ్యాలు తప్పయితే విశదీకరించండి.అంతేకాని,
  భ్రాహ్మణ క్షత్రియ కులాలనెందుకు ఆడి పోసుకుంటున్నారు.మిగిలిన కులాలన్నీ లావా పుట్టుకతోనే అక్కడే వుధ్భవించినట్లు, భ్రాహ్మణ క్షత్రియ కులాలు మాత్రమే దేశాలు పట్టుకు తిరిగి నట్లు, ముందు మీ భావనలో వున్న కులగజ్జిని యితరులకు అంటగట్ట కండి.మీదు మిక్కిలి మీనోటనున్న గజ్జిని కొంతైనా తగ్గించుకోవడం మంచిది అంటు వ్యాధిగా మారి బ్లాగ్లోకమంతా పాకక ముందే..
  బ్లాగులలో చర్చలు జరిపేటఫ్ఫుడు,వ్యక్తులను కించపరచకుండా విషయంపై మీ పాండిత్యాన్ని విన్యసించండి.నలుగురికి వుపయోగపడుతుంది. .చరిత్ర లోని అర్ధంకాని విషయాలపై చర్చించి అవగాహన చేసు కుంని క్లారిటీ తెద్దామనే ప్రయాసకు చేతనయినంత,తోడ్పడ గలిగితే తోడ్పడం డి.
  ఏక పద సమస్యలిచ్చిపూరించమన్న మీ విధాన ప్రక్రియ నాకు నచ్చి, ముచ్చట పడి,నాయంతట నేను చర్చ లోపాల్గొన్న మాట వాస్తవం. యిలా సంస్కార రహితంగా వ్యవహరించే వారితో జాగ్రత్త పడండి. నా వాదన నాది.లోపాలు వుండ వచ్చు. చర్చ జరగనివ్వండి. అవగానా రాహితి వుంటే తెలియ చెప్పండి. అంగీకార యోగ్యమైతే ఒప్పుకుందాం. విషయ పరంగా విభేదాలుంటే విశదపరచండి.కాని వివాదాస్పద వాఖ్యలు చేయకండి. .సరైన విషయం వెలికి తెండి. నలుగురికీ పంచండి.అందరం పంచుకుందాం. అందుకు యీ బ్లాగ్ ప్రక్రియ మహత్తర వేదికగా మార్చండి. . Let’s not currupt it. అంతేగాని ఎదుటి. వ్యక్తి సామర్ధ్యాన్ని, వ్యక్తిత్వాన్నికించపరచడం బ్లాగర్లకు గానీ బ్లాగ్ప్రపంచానికి గానీ మంచిది కాదు…….వి.గ్నానులు,మేధావులూ వ్యవహరించ వలసిన తీరిది కాదు.Nutakki

  వ్యాఖ్య ద్వారా Nutakki Raghavendra Rao — జనవరి 3, 2010 @ 1:35 ఉద. | స్పందించండి


RSS feed for comments on this post. TrackBack URI

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

వర్డ్‌ప్రెస్.కామ్‌లో బ్లాగండి.

%d bloggers like this: